ఈ వారం బాక్సాఫీసు ముందుకు వస్తున్న చిత్రాల్లో అందరి ద్రుష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘శాంతల’. డిసెంబర్ 15న పాన్ ఇండియా భాషల్లో విడుదలౌతున్న ఈ చిత్రం ఇప్పటికీ ప్రమోషనల్ కంటెంట్ తో చాలా క్యురియాసిటీని పెంచింది. ‘ఫ్యామిలీమెన్’ వెబ్‌సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న అశ్లేషా ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న పిరియాడిక్ మూవీ ఇది. నిహాల్ కోదాటి హీరో పాత్రలో కనిపించగా, వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
యథార్థ సంఘటన ఆధారంగా సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు పర్యవేక్షణలో డాక్టర్ యిర్రంకి సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కర్ణాటకలోని హళిబేడు ఆలయానికి సమీపంలో ఉన్న గిరిజన తండాలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శేషు పెద్దిరెడ్డి దర్శకత్వం వహించారు.
యునిక్ కంటెంట్ తో పాటు మంచి నిర్మాణ విలువలతో ఈ సినిమా తెరకెక్కించారు. స్టార్ రైటర్ మాధవ్ బుర్రా రాసిన మాటలు, రమేష్ బాబు కెమరాపనితనం, కృష్ణ ప్రొడక్షన్ డిజైన్ వింటేజ్ ఫ్రేమింగ్, సెట్ వర్క్‌తో 1950నాటి పరిస్థితులుని కళ్ళకు కట్టినట్లు ట్రైలర్, ప్రచార చిత్రాల్లో చూపించాయి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ మరో ఆకర్షణ.
ప్రస్తుతం ఆడియన్స్ పిరియాడిక్ డ్రామాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ‘శాంతల’ ప్రచార చిత్రాలతో నమ్మకం కలిగించడంతో ఇప్పుడు అందిరి ద్రుష్టి ఈ సినిమాపైనే పడింది.