సాహో హీరోయిన్ శ్రద్ధ కపూర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ కోసం వేట చాలా రోజులు జరిగింది. కన్నడ బ్యూటీ రష్మిక మందనా, బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే, పరిణీతి చోప్రాలను సంప్రదించారు. అయితే వీరందరూ కాకుండా శ్రద్ధ కపూర్ కి ఈ అవకాశం వరించింది. ‘ఆషికి -2’ చిత్రంలో శ్రద్ధ కపూర్ నటనను మెచ్చి డైరక్టర్ సుజీత్ ఈమెను సెలక్ట్ చేశారు. అంతేకాదు ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తెరకెక్కుతోంది కాబట్టి బాలీవుడ్ భామకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు.

శ్రద్ధకి పారితోషికం కూడా బాగానే ఇచ్చిన్నట్లు సమాచారం. 9 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పందాలు జరిగాయని తెలిసింది. హీరోయిన్ కే ఇంత మొత్తం ఇస్తుంటే ఇక బడ్జెట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ దుబాయ్ షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. అక్కడే ఆశ్చర్యకరమైన లొకేషన్లలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, ప్రభాస్ లపై భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీన్ లో శ్రద్ధ కపూర్ కూడా విన్యాసాలు చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus