రామ్‌చరణ్ ప్లానింగ్ బాగుంటుందని అందరూ అంటుంటారు. వరుస సినిమా షూటింగ్స్ ఉన్నా… ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి చక్కగా టైమ్ ఇస్తాడు అంటుంటారు. తాజాగా మరోసారి అతని టైమ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ బయటకొచ్చింది. ఈ విషయమం చెప్పే ముందు ఈ రోజు శర్వానంద్ చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్టు గురించి చెప్పాలి. ‘గ్రేట్ పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్ రామ్‌చరణ్’ అంటూ ఓ పోస్టు పెట్టాడు. అర్థమైందిగా రామ్‌చరణ్ టైమింగ్ గురించి ఎందుకు ముందు చెప్పామో. కాకపోతే నెక్స్ట్ పేరా చదివేయండి.
‘ఆచార్య’ సినిమా షూటింగ్ కోసం ఇటీవల రామ్‌చరణ్ మారేడుమిల్లి వెళ్లాడు. శుక్రవారం చిత్రీకరణ ముగించుకొని హైదరాబాద్ వచ్చేశాడు. మామూలుగా అయితే షూటింగ్ అయిపోయింది కాబట్టి వచ్చేశాడు అనుకోవచ్చు. అయితే శర్వానంద్ బర్త్ డే ఉంది కాబట్టి… ముందుగా ప్లాన్ చేసుకొని వచ్చాడు అనేది మెగా కాంపౌండ్ టాక్. శర్వా తన బర్త్‌డే పార్టీ ఫొటోలు షేర్ చేసేసరికి ఈ విషయం బయటకు వచ్చింది. ఇక ఈ పార్టీ గురించి చూసుకుంటే.. ఇటీవల కాలంలో ఏటా చరణ్.. శర్వాకు బర్త్‌డే పార్టీ ఇస్తున్నాడు. అలా ఈ ఏడాదీ ఇచ్చాడు.
ఇన్నాళ్లూ స్నేహితులుగా ఉన్న చరణ్, శర్వా … బంధువులు కూడా అవుతారని ఆ మధ్య వార్తలొచ్చాయి. చరణ్ బంధువుల అమ్మాయిని శర్వా పెళ్లి చేసుకుంటాడనేది ఆ వార్తల సారాంశం. అయితే దీనిపై ఎటువైపు నుండి కూడా ప్రకటన గానీ, స్పందన గానీ రాలేదు. ఇదంతా పక్కన పెట్టేస్తే… ఈ పార్టీకి ఎవరెవరు వచ్చారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రభాస్ ముంబయిలో ఉన్నాడు కాబట్టి… వచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఎవరెవరు వచ్చారో మరి.