టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ కెరీర్ తొలినాళ్ల నుంచి భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. భిన్నమైన కథలు శర్వానంద్ కు కొన్నిసార్లు సక్సెస్ అందిస్తే మరి కొన్నిసార్లు షాకిచ్చాయి. ఐదో తారీఖు శర్వానంద్ తొలి సినిమా కాగా శంకర్ దాదా ఎంబీబీఎస్, గౌరి, సంక్రాంతి సినిమాలలో గుర్తింపు ఉన్న పాత్రలలో నటించి శర్వానంద్ మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత శర్వానంద్ పలు సినిమాలలో హీరోగా నటించి సక్సెస్ సాధించారు.
శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమా వచ్చే వారం థియేటర్లలో రిలీజ్ కానుంది. శర్వానంద్ కు జోడీగా రీతూవర్మ ఈ సినిమాలో నటించగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఒకే ఒక జీవితం సినిమాతో శర్వానంద్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
శర్వానంద్ గత సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. యావరేజ్ టాక్ వచ్చినా రష్మిక హీరోయిన్ గా నటించినా ఫుల్ రన్ లో ఈ సినిమా 7 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోలేకపోవడం గమనార్హం. శర్వానంద్ తో పాటు కెరీర్ మొదలుపెట్టిన చాలామంది హీరోలు ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు. నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఒకే ఒక జీవితం సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
శర్వానంద్ ఒక్కో సినిమాకు 8 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒక విధంగా శర్వానంద్ భవిష్యత్తు ఈ సినిమాపై ఆధారపడి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఒక జీవితం సినిమాతో శర్వానంద్ కెరీర్ పుంజుకుంటుందేమో చూడాల్సి ఉంది. ఒకే ఒక జీవితం ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. శర్వానంద్ జాతకాన్ని ఈ సినిమా మారుస్తుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర