శర్వానంద్ హీరోగా ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నూతన దర్శకుడు బి.కిషోర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.విడుదల రోజున ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. కానీ ‘జాతి రత్నాలు’ పోటీకి బాక్సాఫీస్ వద్ద నిలబడలేక పోయింది. వెంకయ్య నాయుడు వంటి ప్రముఖుల నుండీ ఈ చిత్రానికి ప్రశంసలు దక్కినప్పటికీ అవి ‘శ్రీకారం’ ఫలితాన్ని మార్చలేకపోయాయి. ఇది ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ థీమ్ తోనే రూపొందడం వల్ల జనాలకు రొటీన్ అనే భావన కలిగించింది.
అయినప్పటికీ ఐ.ఎం.డి.బి(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) సంస్థ ‘శ్రీకారం’ కు 7 రేటింగ్ ను ఇచ్చింది. ఇది మంచి రేటింగే …! దాంతో ఈ చిత్రాన్ని ఓటిటిలో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16న ఈ చిత్రం సన్ నెక్స్ట్ ఓటిటిలో విడుదల కాబోతుంది. దాంతో కచ్చితంగా ఈ చిత్రం ఓటిటిలో మంచి వ్యూయర్ షిప్ ను సాధిస్తుంది అని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు.
మరి వారి నమ్మకం ఎంత బలమైందో చూడాలి. థియేటర్లలో సక్సెస్ అయిన ‘జాతి రత్నాలు’ చిత్రం ఓటిటిలో విడుదలయ్యాక మాత్రం విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే థియేటర్లలో ప్లాప్ అయిన రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’ చిత్రానికి ఓటిటిలో మంచి స్పందనే లభిస్తుంది. మరి ‘శ్రీకారం’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూద్దాం.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!