Sharwanand: శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

శర్వానంద్ హిట్ సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ఈయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. శర్వానంద్ గత రెండు నెలల క్రితం రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే ఈయన పెళ్లి పనులలో భాగంగా ఇన్ని రోజులు సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇకపోతే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతున్న సినిమా పనులలో శర్వానంద్ విజయయ్యారు.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాకు బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలు దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ఇదే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఇదే టైటిల్ పెడితే బాగుంటుందన్న ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు.

మరి ఈ సినిమాకు ఇదే టైటిల్ ప్రకటిస్తారా లేకపోతే మరేదైనా మారుస్తారా అన్న విషయం త్వరలోనే తెలియనుంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ తెలియజేయనున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ప్రకటించకపోవడం గమనార్హం.

ఇక శర్వానంద్ (Sharwanand) విషయానికి వస్తే..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలో నటించిన శర్వానంద్ అనంతరం హీరోగా ఎంట్రీంచారు. అయితే ఈయన హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక చివరిగా ఒకే ఒక జీవితం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus