నేపాల్లో ప్రేమలో పడిన శర్వానంద్, సాయి పల్లవి!

  • November 17, 2017 / 12:36 PM IST

యువ హీరో శర్వానంద్, ఫిదా బ్యూటీ సాయిపల్లవి ప్రేమలో ఉన్నారా ? నేపాల్లో ప్రేమించుకున్నారా ? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు ఫిలిం నగర్ వాసులు. అయితే నిజ జీవితంలో కాదు..  సినిమా కోసం ప్రేమలో పడబోతున్నారు. అసలు విషయంలోకి వెళితే..  యువ హీరో శర్వానంద్ ఈ సంవత్సరం సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి లతో తలపడ్డారు. శతమానం భవతి చిత్రంతో విజయం అందుకున్నారు. దీని తర్వాత చేసిన  “రాధ”  నిరాశపరిచినప్పటికీ మహానుభావుడితో హిట్ కొట్టారు. ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.

త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ పోషించనున్నారు. ఈ చిత్రం కంటే ముందు మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాకి ఓకే చెప్పిన శర్వా ఆలస్యం లేకుండా షూటింగ్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం హను తో కలిసి శర్వానంద్ నేపాల్ కి వెళ్లినట్టు తెలిసింది. అక్కడే రొమాంటిక్ మూవీ ఎక్కువభాగం షూటింగ్ జరుపుకోనుంది. అందుకోసం లొకేషన్ వేటలో ఇద్దరూ ఉన్నారు. అక్కడ లొకేషన్స్ ఫైనల్ అయిన వెంటనే షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు. “లవ్ ఇన్ నేపాల్” అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవితో శర్వా ప్రేమలో పడనున్నారు. ఈ తమిళ పిల్ల ఈ సారి నేపాలీ అమ్మాయిగా కనిపించనుంది.

ప్రస్తుతం సాయి పల్లవి నానితో ఎంసీఏ మూవీలో నటిస్తోంది. ఆ షూటింగ్ పూర్తి అయిన తర్వాత శర్వా, హను మూవీ షూటింగ్ లో జాయిన్ కానుంది.  కృష్ణ గాడి వీర ప్రేమ గాధ విజయం తర్వాత హను రాఘవపూడి చేసిన లై మూవీ నిరాశపరచడంతో.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని హను కసితో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus