మే 30న విడుదలకు సిద్దమవుతున్న ‘షష్టి పూర్తి’

‘లేడీస్ టైలర్ ‘ విడుదలైన 38 ఏళ్ల తర్వాత డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించడం –
‘ మేస్ట్రో ‘ ఇళయరాజా చాలా ఏళ్ల తర్వాత ఒక తెలుగు సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ రావడం , మీడియా తో ముచ్చడించడం –
‘ఆస్కార్ విజేత ‘ ఎమ్ ఎమ్ కీరవాణి తొలిసారి ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాట రాయడం –
‘ ఎస్.పి. చరణ్ తొలిసారిగా ఇళయరాజా స్వర సారధ్యంలో పాట పాడటం –
ఏనాడూ ప్రెస్ మీట్స్ లో కనపడని సుప్రసిద్ద కళా దర్శకుడు ‘ పద్మశ్రీ ‘ తోట తరణి ఈ సినిమా టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొని మాట్లాడటం –
ఇలాంటి ఎన్నో విశేషాలతో ‘షష్టి పూర్తి’ చిత్రం ‘టాక్ ఆఫ్ ది టాలీవుడ్‘గా నిలిచింది.
రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా పవన్ ప్రభ దర్శకునిగా పరిచయ మవుతున్నారు. ‘మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్‘ పతాకం పై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30 న విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా దర్శక నిర్మాతలు పవన్ ప్రభ , రూపేష్ మాట్లాడుతూ – “ ఈ సినిమాకి ఎందరో హేమాహేమీలు పని చేశారు. అభినయంలో ఆరితేరిన రాజేంద్రప్రసాద్ , అర్చన ఈ సినిమాకు మెయిన్ అస్సెట్. ఇక ఇళయరాజా స్వరాల వల్ల మా చిత్రానికి ప్రేక్షకుల్లో గొప్ప అటెన్షన్ వచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. మళ్లీ విoటేజ్ ఇళయరాజాను వింటున్నామని అందరూ ప్రశంసిస్తున్నారు. ‘ఏదో ఏ జన్మలోదో ..’ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సాహిత్యం అందించడం మా అదృష్టం. రెహమాన్ రచించిన ‘ఇరు కనులు కనులు కలిసి మురిసె‘ పాటను ఎస్పి చరణ్ , విభావరి ఆలపించారు. ఎక్కడ విన్నా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఈ పాటల కారణంగా ప్రేక్షకుల్లోనే కాకుండా , బిజినెస్ సర్కిల్స్ లో కూడా మా సినిమాపై స్పెషల్ అటెన్షన్ వచ్చింది. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అవుట్ పుట్ కూడా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఈ సమ్మర్ కి మంచి ఫీల్ గుడ్ మూవీ తో వీడ్కోలు చెప్పవచ్చు. మిగిలిన 3 పాటలను , ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేస్తాం “ అని తెలిపారు.

రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ ,  ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, ‘చలాకి’ చంటి, ‘బలగం’ సంజయ్, అనుపమ స్వాతి, రుహీనా, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, అంబరీష్ అప్పాజీ ఇందులో ప్రధాన తారాగణం.

‘షష్టిపూర్తి’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం; పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను; పీఆర్వో: పులగం చిన్నారాయణ; మార్కెటింగ్: టాక్ స్కూప్; ప్రొడక్షన్ కంట్రోలర్: బిఎస్ నాగిరెడ్డి; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్; స్టంట్స్: రామకిషన్; ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, కొరియోగ్రఫీ: స్వర్ణ మాస్టర్, నిక్సన్ మాస్టర్, ఈశ్వర్ పెంటి, లిరిక్స్: కీరవాణి, చైతన్య ప్రసాద్, రెహమాన్; కో డైరెక్టర్: సూర్య ఇంజమూరి; డీఓపీ: రామ్, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, బ్యానర్: మా ఆయి ప్రొడక్షన్స్; నిర్మాత: రూపేష్, స్క్రీన్ ప్లే- సంభాషణలు- దర్శకత్వం : పవన్ ప్రభ.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus