బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ బెయిల్ కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నా.. కోర్టు రిజెక్ట్ చేస్తూనే ఉంది. అయితే ఈ కేసులో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఆర్యన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, పూజా భట్ ఇలా చాలా అందని ఆర్యన్ కు తమ సపోర్ట్ తెలియజేశారు. తాజాగా సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా కూడా ఈ విషయంపై స్పందించారు.
ఆర్యన్ ఖాన్ ఈ కేసులో టార్గెట్ అవ్వడానికి కారణం షారుఖ్ ఖాన్ అంటూ కామెంట్స్ చేశారు శత్రుఘ్న సిన్హా. ఆయనొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఈ విషయంపై పోరాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదని.. ఇది వేరొకరి సమస్య వారే దీన్ని పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారని చెప్పారు. ఇక్కడ వ్యక్తులు చాలా భయపడుతున్నారని అన్నారు. ఆర్యన్ ను టార్గెట్ చేయడానికి అతడి మతమే కారణమని చాలా మంది అభిప్రాయపడుతున్నారని.. అది కరెక్ట్ కాదని అన్నారు.
అతడు కూడా భారతీయుడే అని అన్నారు. ఈ కేసులో మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్ వంటి వారు ఇన్వాల్వ్ అయినప్పటికీ.. ఆర్యన్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి మాత్రం కచ్చితంగా షారుఖ్ ఖాన్ సెలబ్రిటీ కావడమే అని అన్నారు. గతంలో ఓ కేసులో సైతం ఇలానే దీపికా పదుకోన్ ని మాత్రమే మీడియా ఫోకస్ చేసిందని గుర్తుచేసుకున్నారు.