ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను కథాంశాలుగా తెరకెక్కించే సినిమాలు, సిరీస్‌లకు మంచి స్పందన వస్తుంటుంది. ఆ ట్రెండింగ్ ఇప్పుడు ఉండక్కర్లేదు… ఒకప్పుడెప్పుడో ట్రెండ్ అయిన విషయాలైనా ఫర్వాలేదు. అప్పుడేం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో చాలాసార్లు రుజువు అయిన ఈ విషయం మరోసారి రుజువైంది. ఈసారి కథాంశం షీనా బోరా హత్య కేసు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇప్పుడు ఏకంగా 18 దేశాల్లో ట్రెండ్ అవుతోంది.
వరుస వాయిదాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. డాక్యుమెంటరీని తీస్తున్నాం అని ప్రకటించినప్పటి నుండి విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్‌కి ఫుల్ స్టాప్ పెడుతూ ఫిబ్రవరి 29 నుండి ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. మన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా (Sheena Bora) హత్య కేసుపై రూపొందించిన ఈ క్రైమ్ డాక్యుమెంటరీ మిలియన్ల వ్యూస్ సాధిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ టాప్ 10లో కొనసాగుతోంది. మన దగ్గరే కాదు.. కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు 18 దేశాల్లో కూడా ట్రెండింగ్‌లో ఉంది. విడుదలైన దగ్గరి నుండి ఇప్పటి వరకు మొత్తం 2.2 మిలియన్ల గంటల వాచ్‌టైమ్‌ను నమోదు చేసిందట. ఈ భారీ ప్రేక్షకాదరణ కారణంగా ‘అవతార్’, ‘లవ్ ఈజ్ బ్లైండ్’ లాంటి సినిమా రికార్డులను ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ 10 రోజుల్లోనే దాటేసింది.
2012లో షీనా బోరా హత్య జరిగింది. అక్కడికి మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను విచారించగా హత్య సంగతి బయటపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది దేశంలో పెను సంచలనం అయింది. ఇప్పుడు ఆ కథనే డాక్యుమెంటరీలో చూపించారు. దీంతో ప్రేక్షకులు ఈ డాక్యుమెంటరీ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!