Star Actress: తన అనారోగ్య సమస్యని బయటపెట్టి షాకింగ్ కామెంట్స్ చేసిన నటి

  • July 23, 2023 / 09:25 PM IST

సినిమా వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. పైకి వాళ్లకి ఏ లోటు లేదు అన్నట్టు ఉంటారు కానీ… వాళ్లకి కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు తమకు ఆ సమస్య ఉంది.. ఈ సమస్య ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. నటి షెర్లిన్ చోప్రా కూడా అనారోగ్య సమస్యలతో ఎన్నో కష్టాలు పడినట్టు చెప్పి షాకిచ్చింది. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా ఈమె చాలా ఫేమస్.

ఈమె మైక్ పట్టుకుంటే వివాదాలకు శ్రీకారం చుట్టినట్టే అంటూ అంతా కామెంట్లు చేస్తుంటారు. ఇక ఈమె డ్రెస్సింగ్ అలాగే ఈమె సినిమాల్లో నటించే సన్నివేశాలు వివాదాస్పదమైన సందర్భాలు ఉన్నాయి. ఈమె నటించిన ‘పౌరాష్పూర్ 2 ‘ అనే వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. వీటి ప్రమోషన్స్ లో ఆమె కొన్ని ఊహించని కామెంట్లు చేసి షాకిచ్చింది.’ 2021 లో నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది. అప్పుడు నా పని అయిపోయిందనుకున్నాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు.. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నా కుటుంబం నాకు అండగా నిలబడలేదు.

నాకు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా నన్ను ఆదరించిన వారు కూడా లేరు. ధైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కొన్నాను. జీవితాన్ని సంపూర్ణంగా గడపాలి .ఇక డయాలసిస్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లెంటేషన్ కానీ చేస్తేనే నేను బ్రతుకుతాను అని వైద్యులు చెప్పారు. వారంలో మూడు రోజులు హాస్పిటల్ కి వెళ్లడం నా వల్ల కాదు అని నేను అనుకున్నాను. కానీ ఫైనల్ గా నాకు నయమైంది. పునర్మాణమా లభించినట్టు అయ్యింది’ అంటూ షెర్లిన్ చోప్రా (Actress) చెప్పుకొచ్చింది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus