పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఆయన భార్య బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దారుణ పరిస్థితులను ఎదుర్కొంటుంది. తన ఇమేజ్ డ్యామేజ్ అవ్వడంతో మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇన్స్పిరేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది. తాజాగా ఆమె ఓ పుస్తకంలో మిస్టేక్స్ అని రాసి ఉన్న అధ్యాయంలోని పేజీని షేర్ చేసింది.
అందులో ఏం రాసుందంటే.. ”చిన్నపాటి తప్పులు చేయకుండా మన జీవితాన్ని ఆసక్తికరంగా మలుచుకోలేం. అయితే ఆ తప్పులు భయంకరంగా.. ఇతరులను బాధించేలా ఉండకూడదు. మిస్టేక్స్ అనేవి ఎప్పుడూ జరుగుతుంటాయి. అవి మనకి సవాలు విసిరేలాగా.. ఉత్తేజపరిచే అనుభవాలుగా.. లేదా మర్చిపోయే విధంగా ఉండాలి. ఆ తప్పుల నుంచి నన్ను నేను క్షమించుకొని.. వాటి నుంచి ఎంతోకొంత నేర్చుకుంటాను” అని రాసున్న పేజీను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది.
‘నేను తప్పు చేశాను. అయినా ఏం పర్లేదు’ అని ఈ పోస్ట్ పై రాసుకొచ్చింది. తప్పుల గురించి ఇంత పెద్ద పోస్ట్ షేర్ చేసిన శిల్పాశెట్టి ఆమె చేసిన తప్పు ఏంటనేది మాత్రం చెప్పలేదు. రాజ్ కుంద్రా అరెస్ట్ తరువాత శిల్పాశెట్టి టీవీ షోలకు కూడా దూరమైంది. ఆమెకి బదులుగా నిర్వాహకులు వేరే తారలను రంగంలోకి దించుతున్నారు.