Shilpa Shetty: డైరెక్టర్ చెప్పినట్టు చేస్తే కాలు విరిగింది : శిల్పా శెట్టి

స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి షూటింగ్‌లో గాయపడింది. ఓ యాక్షన్‌ సన్నివేశంలో భాగంగా నటిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయి కాలు విరగొట్టుకుంది. ఈ విషయాన్ని స్వయంగా శిల్పా శెట్టి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. తనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్న ఫోటోని షేర్ చేసి … ‘ ‘వాళ్లు రోల్‌ కెమెరా.. యాక్షన్‌.. బ్రేక్‌ ఎ లెగ్‌’ అన్నారు. అక్షరాలా నేను అదే చేశాను. ఫలితంగా 6 వారాలపాటు షూటింగ్‌కు బ్రేక్‌ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తొందర్లోనే కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాను. అప్పటి వరకు నన్ను మర్చిపోకండి. ప్రార్థనలు ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తాయి అని నేను నమ్ముతాను. కృతజ్ఞతతో మీ శిల్పాశెట్టి కుంద్రా’ అంటూ రాసుకొచ్చింది.

దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్‌ పోలీసు ఆఫీసర్‌’ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది శిల్పా శెట్టి. ఇందులో సిద్ధార్థ్‌ మల్హోత్రా లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడు.ఇందులో శిల్పా పోలీసు ఆఫీసర్‌ పాత్రని పోషిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కోసం శిల్పా శెట్టి ఇసుకలో చిత్రీకరించిన భారీ యాక్షన్‌ సన్నీవేశాల్లో పాల్గొంది. ఆ టైంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. శిల్పా శెట్టి అభిమానులు ఈమె త్వరగా కోలుకోవాలని ఆమె పోస్ట్ పై కామెంట్లు పెడుతున్నారు.

శిల్పాశెట్టి.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..! ‘వీడెవడండీ బాబు’ ‘సాహస వీరుడు సాగర కన్య’ ‘ఆజాద్’ ‘భలేవాడివి బాసు’ వంటి చిత్రాల్లో నటించింది. అటు తర్వాత 2009లో ప్రముఖ బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకొని సినిమాలు తగ్గించింది.రాజ్ కుంద్రాకి ఈమె రెండో భార్య అన్న సంగతి తెలిసిందే. గతేడాది రాజ్ కుంద్రా వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచాడు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus