బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి (Shilpa Shetty) గతంలో తెలుగు సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబుతో (Mohan Babu) ‘వీడెవడండీ బాబు’, వెంకటేష్ తో (Venkatesh) ‘సాహసవీరుడు సాగరకన్య’ వంటి సినిమాల్లో నటించింది ఈ పొడుగు కాళ్ళ సుందరి. అప్పట్లో ఈమె చాలా కాస్ట్లీ హీరోయిన్. అయితే కెరీర్ డౌన్ అవుతుంది అని తెలుసుకుని వెంటనే వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. మొన్నామధ్య ఇతను నీలి చిత్రాల కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ జంట ఆస్తుల వివరాలు ప్రతి ఒక్కరినీ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి అని చెప్పాలి. ఈ జంటకు వేల కోట్ల ఆస్తి ఉంది అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకి ఏకంగా రూ.3,000 కోట్ల ఆస్తి ఉందట.ముంబై, అరేబియా సముద్ర తీరాన వీరికి ఉన్న బంగ్లా వాల్యూ అక్షరాలా రూ. 100 కోట్లట.అలాగే పూణేలో కూడా వీరికి ఒక విలాసవంతమైన ఇల్లు ఉందట.
దీంతో పాటు బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, లంబోర్ఘిని అవెంటడార్, BMW X5 వంటి కోట్లు విలువ చేసే కార్లు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు వీరికి ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.రాజ్ కుంద్రాకి అవుట్ రైట్ గా రూ. 2,800 కోట్ల ఆస్తి ఉంది. అలాగే ఇంకా చాలా బిజినెస్… లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ టీంకి ఓ యజమాని కూడా కావడం..
స్టీల్, రియల్ ఎస్టేట్, ఫారెక్స్ ట్రేడింగ్ వంటి వాటిలో కూడా అతను పెట్టుబడులు పెట్టడం జరిగింది.మరోపక్క శిల్పా శెట్టి (Shilpa Shetty) కూడా రూ. 150 కోట్ల వరకు ఆస్తి కలిపి ఉన్నట్టు బి టౌన్ టాక్. వీళ్ళకి రూ.3000 కోట్ల ఆస్తి ఉండటం వల్లనే బి టౌన్లో చాలా ప్రత్యేకంగా నివసిస్తున్నారు. అంతేకాదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వీళ్లపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు.