సాహసవీరుడు సాగర కన్య, వీడెవడండీ బాబు, ఆజాద్ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి బిజినెస్‌మేన్ రాజ్‌కుంద్రా ని ప్రేమించి, పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు వియాన్ రాజ్‌కుంద్రా అనే కొడుకున్నాడు. ఈ చిన్న కుటుంబం సంతోషంతో సాగుతోంది. ఈ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. శిల్పా శెట్టి ఓ డయాగ్నస్టిక్ సెంటర్ నుంచి రిపోర్టులతో బయటకు వస్తున్న ఫొటోని ఆధారం చేసుకొని ఆమె గర్భవతిని కొంతమంది వార్తని వైరల్ చేశారు.
రెండోసారి గర్భవతి కావడంతో ఆమె వైద్య పరీక్షల కోసం క్లినిక్‌కి వెళ్లి వస్తున్నారనీ స్పష్టం చేశారు. దీంతో మిత్రులు శిల్పాకి శుభాకాంక్షలు చెప్పడం మొదలెట్టారు. మొదట షాక్ తిన్న ఆమె.. మీడియాలో తనపై వస్తున్న వార్తలను తెలుసుకొని స్పందించారు. ఈ వార్తలను కొట్టిపడేశారు. ‘‘నా జీవితంలో కొత్తగా ఏమీ జరగలేదు.. నేను గర్భవతిని కాదు. రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లి వచ్చా’’ అని శిల్పా క్లారిటీ ఇచ్చారు. తెలుసుకోకుండా ఇటువంటి వార్తలను స్ప్రెడ్ చేయవద్దని కోరింది. సినిమాలకు దూరమైనప్పటికీ ఈ బ్యూటీ బుల్లితెరపై అప్పుడప్పుడూ కనిపిస్తూ అభిమానులను ఆనందింపజేస్తోంది.