చిక్కుల్లో పడ్డ రాజ్ కుంద్రా!

ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నీలి చిత్రాలను చిత్రీకరించి వాటిని కొన్ని యాప్స్ ద్వారా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్న కేసులో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రాపై కేసు నమోదైంది. తాజాగా ఈ పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా పాత్ర ప్రముఖంగా ఉన్నట్లు కీలక ఆధారాలు లభించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ రాజ్ కుంద్రా జూన్ లో ముంబై సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మోడల్ షెర్లిన్ చోప్రా స్టేట్మెంట్ ఆధారంగా.. వెబ్ సిరీస్ పేరుతో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారని ఆరోపణలపై కుంద్రాకు సంబంధించిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉద్యోగికి ఏప్రిల్ లో బెయిల్ మంజూరైంది. ఈ కేసులో పోలీసులు రాజ్ కుంద్రాకు సమన్లు జారీ చేశారు.

ఈ సమన్లపై స్పందించిన శిల్పాశెట్టి భర్త ఆ స్టార్టప్ నుండి తాను అప్పటికే వైదొలిగానని.. ఆ కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఈ కేసులో రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా ఆధారాలు దొరకడంతో అతడిని అరెస్ట్ చేశారు. 2009లో శిల్పాశెట్టి.. రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. 2012లో వీరికి వియాన్ జన్మించాడు. సరోగసీ ద్వారా ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. .

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus