1993లో వచ్చిన షారుక్ ఖాన్ ‘బాజిగర్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులకు పరిచయమైంది శిల్పా శెట్టి. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు వరుస అవకాశాలు దక్కాయి. తరువాత ధర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఈమెను టాలీవుడ్ కు కూడా పరిచయం చేసారు. వీరి కాంబినేషన్లో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సాహస వీరుడు సాగర కన్య’ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా శిల్పా శెట్టి అందాలు ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచాయి.
తరువాత మోహన్ బాబు హీరోగా వచ్చిన ‘వీడెవడండీ బాబు’.. నాగార్జున ‘ఆజాద్’.. బాలకృష్ణ ‘భలేవాడివి బాసు’ వంటి చిత్రాల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. అయితే అవేమీ హిట్ అవ్వకపోవడంతో తెలుగులో ఈమె మళ్ళీ సినిమాలు చెయ్యలేదు. ఇక ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను వివాహం చేసుకున్నాక చాలా వరకూ సినిమాలు తగ్గించింది. పలు టీవీ షో లకు హోస్ట్ గా మాత్రమే చేస్తూ వచ్చింది. ఇక తనకి కొడుకు పుట్టిన తరువాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.
లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ వచ్చిన శిల్పా శెట్టి.. తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి.. తన అభిమానులకు ఫీస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా ఈమె ఖరీదైన ఇల్లుని చూస్తే మతులు పోవాల్సిందే. ఓ స్టార్ హోటల్ రేంజ్లో ఉంది ఈమె ఇల్లు. ఓ అద్దాల మేడ అనట్టు కూడా అనిపించకమానదు. జిమ్, గార్డెన్, వంటగది ఇలా దేనిని చూసినా వావ్ అనాల్సిందే. ఇక శిల్పా శెట్టి ఇంటి ఫోటోలు,వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
View this post on Instagram
Food for thought !!👹👹😈😈😂😂 #fridayfun #laughs #comedy #cray #food
A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on
View this post on Instagram
Everyone needs a lil bit of cheer up !😅🤪 #saturdaysmiles #happiness #comedy #weekend #saturday
A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!