శిల్ప శిరోద్కర్.. ఈ పేరు మనకు కొత్తేమీ కాదు. తెలుగులో ఒక్క సినిమా చేసినా హిందీ సినిమాలు, బిగ్‌బాస్ కారణంగా చాలా మందికి పరిచయం. అన్నింటికి మించి మహేష్ బాబు (Mahesh Babu) మరదలుగా ఇంకాస్త ఎక్కువ పరిచయం. అయితే ఇక్కడ విషయం కూడా అదే. మరదలు అయినప్పటికీ ఎప్పుడూ మహేష్‌బాబు ఎప్పుడూ ఆమె గురించి ఎందుకు ఎక్కడా ప్రస్తావించరు, సోషల్ మీడియాలో కనీసం పోస్టు కూడా ఉండదు అని. అంతేకాదు నమ్రత (Namrata ShirodkarNamrata Shirodkar ), శిల్పకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనే పుకారు కూడా ఉంది.
ఈ విషయాల్ని శిల్ప దగ్గరే ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. దీంతో గత కొన్నేళ్లుగా కొంతమంది వివాదం అంటూ సృష్టిస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది అని చెప్పాలి. ఆమె ఏమంది అనేది తర్వాత చూద్దాం. ముందు పుకార్లు ఎందుకొచ్చాయో చూస్తే క్లారిటీ కూడా ఉంటుంది. శిల్ప ఇటీవల హిందీ బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొంది. సీజన్ చివరివరకు ఉండి ఎలిమినేట్ అయింది. అయితే ఆ సమయంలో ఆమె గురించి మహేశ్ బాబు ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టలేదు ఎందుకు అనేదే ప్రశ్న.
ఇక శిల్ప ఏమందంటే.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడితేనే మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. లేకపోతే వివాదాలు ఉన్నాయని అనుకోవడం కరెక్ట్ కాదు అని క్లారిటీ ఇచ్చింది. అయినా మనుషుల మధ్య అనుబంధాన్ని సోషల్ మీడియా పోస్ట్‌ల ఆధారంగా అంచనా వేస్తారా? మేం ఆన్‌లైన్‌లో ప్రేమను, అభిమానాన్ని చూపించుకునే వాళ్లం కాదు. అయినా నన్ను నేను నిరూపించుకోవడానికి బిగ్‌బాస్‌కి వెళ్లా. నమ్రత సిస్టర్‌గానో, మహేశ్‌బాబు మరదలి గానో వెళ్లలేదు అని చెప్పింది.
మహేశ్, నమ్రతలు ప్రైవేట్ పర్సన్స్. వాళ్లు ఇతరులతో త్వరగా కలవరు. అది చూసి చాలామంది పొగరు అనుకుంటారు. కానీ వాళ్లు చాలా కూల్ పర్సన్స్. మహేశ్ అవసరమైనప్పుడు అండగా నిలబడతాడు అని శిల్ప క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పటికైనా ‘వివాదం’ రూమర్స్ ఆగుతాయా?