శిరీష్ సినిమాకి పోటీ లేదు. మరి ఇప్పుడైనా హిట్ కొడతాడా ?
- May 15, 2019 / 06:12 PM ISTByFilmy Focus
ఒక్కోసారి అదృష్టం కూడా మనల్ని దరిద్రం కంటే గట్టిగా పట్టుకొంటుంది. ఇప్పుడు అల్లు శిరీష్ బాబు పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. అల్లు అరవింద్ ముద్దుల కొడుకు, అల్లు అర్జున్ తమ్ముడు, మెగా ఫ్యామిలీ హీరో అయినప్పటికీ.. ఆరేళ్ళ కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సోలో రిలీజ్ కూడా దొరకలేదు శిరీష్ బాబుకి. దాంతో కొన్ని సినిమాలు కంటెంట్ బాగోక ఫ్లాపైతే.. ఇంకొన్ని సరైన రీచ్ లేక ఫ్లాపయ్యాయి. కానీ.. మొట్టమొదటిసారిగా అల్లు శిరీష్ నటించిన “ఎ బి సి డి” చిత్రానికి సోలో రిలీజ్ దొరికిందనే చెప్పాలి. ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాల్లో చూడదగ్గ ఏకైక చిత్రం “ఎ బి సి డి”. అదే రోజు విడుదలవుతున్న “రోమాంటిక్ క్రిమినల్స్, స్వయంవద” లాంటి చిత్రాలను జనాలు పట్టించుకొంటారన్న ఆశ ఆ చిత్ర దర్శకనిర్మాతలకైనా ఉందో లేదో వాళ్ళకే తెలియాలి.
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ట్రైలర్, సాంగ్స్ బాగుండడంతో ప్రస్తుతానికి “ఎ బి సి డి” చిత్రానికి బజ్ బాగుంది. విడుదలయ్యాక యావరేజ్ టాక్ వచ్చినా సినిమా హ్యాపీగా థియేటర్లలో ఆడేస్తుంది. దాంతో అల్లు శిరీష్ కి మొట్టమొదటి హిట్ రావడం ఖాయం అని విశ్లేషణలు వెల్లడవుతున్నాయి. ఇదేగనుక జరిగితే శిరీష్ కంటే ఎక్కువగా ఆయన తండ్రి అల్లు అరవింద్, అన్నయ్య అల్లు అర్జున్ ఎక్కువగా ఆనందపడటారేమో. చూద్దాం మరి ఏం జరుగుతుందో.












