Shiva Jyothi: మరో కొత్త ఇంటిని కొన్న శివ జ్యోతి..వీడియో వైరల్!

తీన్మార్ వార్తల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి సావిత్రక్కగా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా తెలంగాణ భాషలో గలగల మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి శివ జ్యోతి ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో టాప్ సిక్స్ కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ఈమె భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఈమె గతంలో ఒక ఇంటిని కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ఇంటిని కూడా కొనుగోలు చేశామంటూ గతంలో కొన్ని వీడియోల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే శివజ్యోతి (Shiva Jyothi) తాజాగా గృహ ప్రవేశం చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ గృహప్రవేశ కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. సాంప్రదాయబద్ధంగా శివజ్యోతి తన భర్తతో కలిసి నూతన గృహప్రవేశం చేశారు.

అలాగే బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున గృహప్రవేశానికి హాజరయ్యి సందడి చేశారు. ఇలా స్నేహితులు బంధువుల సమక్షంలో ఈమె గృహప్రవేశ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus