పలు న్యూస్ ఛానల్స్ లో పనిచేసిన శివ జ్యోతి తీన్మార్ వార్తలు చదువుతూ బాగా ఫేమస్ అయ్యింది. ‘తీన్మార్ సావిత్రి’గా ఆమెకు ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే ఆమెకు బిగ్ బాస్ సీజన్ 3 లో అవకాశం దక్కింది. ఆ షోతో ఆమె మరింత పాపులర్ అయ్యింది. ఆ షో ముగిశాక శివ జ్యోతి సొంతిల్లు కూడా కొనుక్కుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటుంది. అప్పుడప్పుడు ఆమె భర్త గంగూలీని కూడా ఫేమస్ చేస్తుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో శివ జ్యోతి ఎక్కువగా ఏడుస్తూనే కనిపించేది.
అందువల్ల ఈమె (Shiva Jyothi) పై చాలా మీమ్స్ వచ్చేవి. ఇక చిన్నతనంలో ఎక్కువ కష్టాలు పడ్డానని, ఆమెది చాలా పేద కుటుంబం అని, ప్రేమ వివాహం చేసుకున్నాక కష్టాలు ఇంకా పెరిగాయని ఆమె చెప్పుకొచ్చేది. అందుకే యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టినట్టు తెలిపింది. అయితే శివ జ్యోతికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అయినప్పటికీ ఇటీవల ఈమె గ్లామర్ బాట పట్టినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఈ అనుమానాలకు దారి తీశాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :