Shiva Jyothi: నా జీవితంలో ఇది చాలా పెద్ద విషయం అంటున్న ‘బిగ్ బాస్’ శివ జ్యోతి..!

‘వీ6లో ‘తీన్మార్’, ‘టీవీ9’ లో ‘ఇస్మార్ట్ న్యూస్’ వంటి షోలతో బాగా పాపులర్ అయ్యింది శివ జ్యోతి. ఈమె అసలు పేరు ఇదే అయినా సావిత్రి అక్కగానే జనాల్లో క్రేజ్ ను సంపాదించుకుంది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ బిత్తిరి సత్తితో వాటి ముచ్చటిస్తున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఈమె ‘బిగ్ బాస్ 3’ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులో ఈమెలో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది శివ జ్యోతి.

Click Here To Watch NOW

అదే చీటికీ మాటికీ కన్నీళ్ళు పెట్టుకోవడం. అలీ రెజా, రవి లతో సాన్నిహిత్యంగా ఉంటూ ఎంత బాగా గేమ్ ఆడినా.. ఎప్పుడూ ఏడుస్తూనే విసిగిస్తుంది ఏంటి? అనే ముద్ర ఈమె పై పడిపోయింది. అయినప్పటికీ ఆ షో ఈమెను మరింత పాపులర్ చేసిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. గత రెండు, మూడు రోజులుగా శివ జ్యోతి ప్రెగ్నెంట్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పై ఆమె స్పందించింది.

ఆమె ఈ విషయం పై స్పందిస్తూ.. “నేను ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇష్టమొచ్చిన థంబ్‌నైల్స్‌ పెట్టి ఈ టాపిక్ ను వైరల్ చేసేస్తున్నారు.అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెబుతా. దయచేసి ఇలాంటివి నమ్మకండి. నా జీవితంలో ఇది చాలా పెద్ద విషయం. నా లైఫ్‌లో కనుక నిజంగా అలాంటి గుడ్‌న్యూస్‌ ఉంటే కచ్చితంగా అందరితో షేర్ చేసుకుంటా. మీకో దండం రా బాబు…!

ఇలాంటి వార్తలు సృష్టించి నన్ను ఇబ్బంది పెట్టకండి” అంటూ ఈమె చెప్పుకొచ్చింది. శివ జ్యోతి దంపతులకి పెళ్ళై చాలా కాలం అయ్యింది. అయితే పిల్లల విషయంలో వాళ్ళు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus