Shiva Nirvana: ఆ ముగ్గురి జీవితాలను ఖుషి మూవీ డిసైడ్ చేయనుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్నుకోరి, మజిలీ సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్ శివ నిర్వాణకు టక్ జగదీష్ సినిమాతో షాకింగ్ ఫలితం దక్కింది. బాక్సాఫీస్ వద్ద టక్ జగదీష్ డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. శివ నిర్వాణ ప్రస్తుతం ఖుషి సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమాపైనే శివ నిర్వాణ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

మరోవైపు విజయ్ దేవరకొండకు గతేడాది విడుదలైన లైగర్ సినిమా భారీ షాక్ ఇచ్చిందనే సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు. విజయ్ దేవరకొండ సైతం ఖుషి సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తే మాత్రమే విజయ్ దేవరకొండ కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.

మరోవైపు హీరోయిన్ సమంతకు శాకుంతలం సినిమా ఫలితం షాకిచ్చింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. సమంత మార్కెట్ పై శాకుంతలం రిజల్ట్ ప్రభావం ఎక్కువగానే పడే అవకాశం అయితే ఉంది. ఈ హీరోయిన్ కూడా ఖుషి సినిమాపై భారీ స్థాయిలోనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో సమంత నటించిన లవ్ స్టోరీ ఇదే కావడం గమనార్హం.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కు సైతం ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల ఫలితాలు షాకిస్తున్నాయి. ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి విజయ్ దేవరకొండ, సమంత, (Shiva Nirvana) శివ నిర్వాణ కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా ఈ ముగ్గురి కెరీర్ లను డిసైడ్ చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఖుషి మూవీ ఫలితం తేలాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus