అక్కినేని నాగార్జున, రాంగోపాల్ వర్మ కెరీర్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం ‘శివ’. కొన్నాళ్లుగా రీ- రిలీజ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. నాగార్జున నటించిన ‘రగడ’ వంటి సినిమాలు రీ- రిలీజ్ అయ్యాయి కానీ.. ఏదీ కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. దీంతో ‘శివ’ చిత్రాన్ని 4Kకి డిజిటలైజ్ చేసి రీ- రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు నాగార్జున.
దాదాపు 2 ఏళ్ళ నుండి కొత్త టీంతో పనులు చేయించారు. ఫైనల్ గా ఆ పనులన్నీ పూర్తి చేసి నవంబర్ 14న ‘శివ’ ని రీ- రిలీజ్ చేశారు. నాగార్జున, రాంగోపాల్ వర్మ యాక్టివ్ గా ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరిగింది.దీంతో మళ్ళీ బాక్సాఫీస్ వద్ద విజృంభించింది ‘శివ’. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.2.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన ‘శివ’.. వీకెండ్ ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా రూ.3.9 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మూడో రోజు దాదాపు రూ.0.60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ తో మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ రీ- రిలీజ్లో సాధించిన కలెక్షన్స్ ను అధిగమించింది. ఇలా రీ- రిలీజ్ లో కూడా రికార్డు కొట్టింది ‘శివ’. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘ఇంద్ర’ రీ రిలీజ్ అయ్యింది. కానీ అన్ సీజన్లో అదీ.. ‘కాంత’ ‘సంతాన ప్రాప్తిరస్తు’ వంటి కొత్త సినిమాలు ఉన్నప్పటికీ వాటిని డామినేట్ చేసి మరీ ‘శివ’ రీ- రిలీజ్లో ఈ ఫీట్ సాధించడం అంటే చిన్న విషయం కాదు.
ఒకవేళ నాగార్జున బర్త్ డే రోజు రీ- రిలీజ్ అయ్యుంటే.. మరింతగా కలెక్ట్ చేసుండేది అనడంలో సందేహం లేదు.