ఒక సినిమా కోసం ఆడిషన్ ఇస్తే.. ఆ సినిమా కోసం కాకుండా వేరే సినిమాకు ఎంపిక చేసిన సందర్భాలు వినే ఉంటారు. హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ ఇస్తే… అనుకోకుండా అదే సినిమాలో క్యారెక్టర్ కోసం ఎంపిక చేయడం లాంటివి కూడా చూసే ఉంటారు, లేదంటే వినే ఉంటారు. అయితే ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చి… ఏకంగా హీరోయిన్ అయిపోయిన వాళ్లు కూడా ఉంటారని నిరూపించారు శివాని నాగరం.
సుహాస్ హీరోగా రూపొందిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ సినిమాలోనే శివాని నాగరం (Shivani Nagaram) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానున్న నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించారు శివాని. ఈ క్రమంలో సినిమాలోకి తాను ఎలా వచ్చారు అనే విషయంలో ఆసక్తికర విషయం చెప్పారు. ఈ చిత్రంలో నటించే అవకాశం ఆడిషన్ ద్వారానే వచ్చిందని చెప్పిన శివానీ… ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పంపితే హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ ఇచ్చాను అని చెప్పారు.
అయితే ఆడిషన్ తర్వాత తనను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు చెప్పారని, తొలిరోజు షూట్‌లో పాల్గొనే వరకు తానే కథానాయికని అనేది నమ్మలేకపోయాను అని చెప్పారు శివానీ. సినిమాలో తాను లక్ష్మి అనే పాత్రలో కనిపిస్తానని తెలిపారు. స్క్రిప్ట్‌లోని ప్రతి డైలాగ్‌ను నేర్చుకున్నానని, అందుకే సెట్‌లో నటించడం పెద్దగా కష్టమనిపించలేదని చెపపారు. అయితే దీంట్లో కొన్ని భావోద్వేగభరిత సన్నివేశాలు చేయడం సవాల్‌గా అనిపించింది అని చెప్పారు.
తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో నటించడం గురించి మాట్లాడుతూ.. ప్రతిభ గల తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లందరికీ మంచి అవకాశాలు రావాలి అని చెప్పారు. తెలుగు అమ్మాయి తెలుగు సినిమాల్లో నటిస్తే చాలా ఉపయోగాలుంటాయి అని చెప్పిన శివానీ.. సెట్లో డైలాగ్ మార్చి ఇస్తే వెంటనే నేర్చుకొని తెలుగు అమ్మాయిలు చెప్పగలరు. అదే వేరే భాష నటి అయితే అర్థం చేసుకోవడానికే టైమ్ పడుతుంది అని తెలుగు అమ్మాయి నాయిక అయితే ఉపయోగం ఏంటో చెప్పారు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!