మూడు భాషల్లో సినిమాలు చేస్తున్న శివాని!

జీవిత, రాజశేఖర్ ల తనయురాలు శివాని హీరోయిన్ గా నటించిన చిత్రాలు ఏవీ రిలీజ్ కాకముందే బిజీ అయిపోతోంది. అతి తక్కువ కాలంలోనే మూడు భాషల్లో సినిమాలు చేస్తోంది. హిందీ హిట్ ‘టూ స్టేట్స్’ రీమేక్‌గా రూపొందుతోన్న తెలుగు సినిమాతో శివానీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్.. కనీసం ఫస్ట్ లుక్ కూడా రాకముందే శివానీ మరో రెండు సినిమాలకు సంతకం చేసింది. కోలీవుడ్‌లో విష్ణు విశాల్ సరసన హీరోయిన్‌గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీవీ స్టూడియోస్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం ‘మదురై’లో షూటింగ్ జరుపుకుంటోంది.

ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. తమిళ దర్శకుడు వెంకటేష్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ కథను సిద్ధం చేసుకుని, తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. ఈ మూడు చిత్రాలకు డేట్స్ క్లాష్  కాకుండా జీవిత చూసుకుంటోంది. దాదాపు ఒకే సమయంలో మూడు భాషల్లో ఎంట్రీ ఇస్తూ శివాని రికార్డ్ సృష్టించింది. ఇవి విజయవంతమయితే దక్షిణాది సినీ పరిశ్రమల్లోని టాప్ హీరోయిన్స్ కి శివాని గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus