Shivarajkumar: పునీత్ రాజ్ కుమార్ – అల్లు అర్జున్ గురించి శివ రాజ్ కుమార్ కామెంట్స్ వైరల్..

కన్నండ కంఠీరవ రాజ్ కుమార్ నట వారసుడిగా కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి.. దాదాపు 125 చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకాభిమానులను అలరించి.. ఇతర భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు.. కరునాడ చక్రవర్తి.. డా. శివ రాజ్ కుమార్.. పెద్ద తమ్ముడు రాఘవేంద్ర రాజ్ కుమార్ నటుడిగా, నిర్మాతగా రాణించారు. రెండో తమ్ముడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. తెర వెనుక కూడా హీరో అనిపించుకున్నారు పునీత్..

స్కూల్, కాలేజీల ద్వారా పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్, గోశాలలు, ఆసుపత్రిలు.. ఎలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మనసుల్లో చెరుగని ముద్ర వేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన్ని ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు తీసుకెళ్లిపోయాడు దేవుడు.. మరణానంతరం.. ఏ వేడుకలో పునీత్ ప్రస్తావన వచ్చినా కానీ శివన్న భావోద్వేగానికి గురవుతూ తమ్ముడిని తల్చుకుంటూ కన్నీంటి పర్యంతమవుతున్నారు.ఆయన నటించిన ‘వేద’ చిత్రం తెలుగులో విడుదలవుతుండగా..

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య అతిథిగా విచ్చేసి మూవీ టీంకి విషెస్ తెలియజేశారు. తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ ఏవీ చూడగానే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన శివన్నను అన్నలా ఓదార్చారు బాలయ్య. ఆయన్నలా చూసి అందరి కళ్లూ చెమర్చాయి. అలాగే ‘వేద’ తెలుగు ప్రమోషన్లలో పునీత్ రాజ్ కుమార్, అల్లు అర్జున్ గురించి శివన్న చెప్పిన ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘‘నా తమ్ముడు పునీత్‌ని అల్లు అర్జున్‌లో చూసుకుంటున్నా.. అల్లు అర్జున్ డ్యాన్స్ చేసే స్టైల్.. నాకు పునీత్ డ్యాన్సింగ్ స్టైల్‌తో పాటు అన్నీ గుర్తు చేస్తుంది.. అల్లు అర్జున్ డ్యాన్స్ చేసిన ‘బుట్ట బొమ్మ’ లాంటి పాట నేను కూడా చేయాలని.. అలా డ్యాన్స్ చేయాలని అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు శివ రాజ్ కుమార్.. కన్నడలో మంచి విజయం సాధించిన ‘వేద’ ఫిబ్రవరి 9న తెలుగులో విడుదలవుతోంది. హర్ష్ ఈ సినిమాకి దర్శకుడు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus