స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ దానికి దూరంగా.. స్వయంకృషితో పైకి రావాలని కోరుకుంటుంది జీవితరాజశేఖర్ ల చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్. హీరోయిన్లకు పెట్టుబడి అందమే. కాబట్టి ఆ అందానికి ఎంతలా మెరుపులు దిద్ది ప్రదర్శిస్తే అంత పాపులర్ అవ్వొచ్చు. ఈ లాజిక్ ను ఇట్టే కనిపెట్టేసిన శివాత్మిక ఈ మధ్య కాలంలో వరుసగా గ్లామర్ ఫోటోలు వంటివి షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 3 ఏళ్ళు దాటింది.
‘దొరసాని’ ‘పంచతంత్రం’ వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది శివాత్మిక. అయితే స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఆ సినిమాలు ఈమె కెరీర్ కు ఆశించిన మైలేజ్ ను ఇవ్వలేకపోయాయి. కమర్షియల్ గా మంచి బ్రేక్ వస్తే తప్ప ఈమె పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కొట్టే అవకాశం లేదు. అందుకోసమే శివాత్మిక ఛాన్స్ దొరికిన ప్రతిసారి గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది.
తాజాగా ఆమె బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబో శారీలో చేసిన గ్లామర్ షో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో నడుము అందాలు, వీపు అందాలతో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది శివాత్మిక. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :