Bigg Boss 7 Telugu: అశ్విని ఏడుపుకి షాక్ అయిన హౌస్ మేట్స్..! శోభాశెట్టి ఫైర్..! అసలు గొడవేంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అంటేనే పెద్ద గొడవ. అందులోనూ ఆడవాళ్ల మద్యలో జరిగిందంటే ఏది వేరే లెవల్లో ఉంటుంది. ఆరో వారం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన నామినేషన్స్ లో శోభాశెట్టి దెబ్బకి అశ్విని భోరు మంటూ ఏడ్చేసింది. అసలు ఏం జరిగిందంటే., బిగ్ బాస్ ఈవారం నామినేషన్స్ లో భాగంగా ముందుగా పోటుగాళ్లగా బయట నుంచీ వచ్చారు కాబట్టి ఐదువారాల ఆటలో ఇంట్లో ఎవరు అనర్హులో ప్రకటిస్తూ నామినేషన్స్ చేయమని చెప్పాడు. ఇక్కడ అశ్విని శోభాశెట్టిని నామినేట్ చేస్తూ గ్రూపిజంగా గేమ్ ఆడుతున్నావని, అలాగే ప్రియాంకని మాన్యుప్లేట్ చేస్తున్నావని అనిపిస్తోందని చెప్పి నామినేట్ చేసింది.

అంతేకాదు, అస్సలు నీతో ఐ కాంటాక్ట్ కూడా అవ్వడం లేదని ఎవైడ్ చేస్తున్నావని కూడా రీజన్ చెప్పింది. దీనికి శోభాశెట్టి ఫుల్ పైర్ అయ్యింది. ఇలాంటి చెత్త రీజన్స్ చెప్తావేంటి., ఐదు వారాలు మేము ఎంతో కష్టపడి ఈ రేంజ్ కి వచ్చాం. గర్ల్స్ లో నేను ఒక్కదానినే ముందు పవర్ అస్త్రా సాధించి హౌస్ మేట్ అయ్యా అంటూ గుర్తు చేసింది. అంతేకాదు, మేము ఎవరెవరు గ్రూప్ గా ఆడుతున్నాం, గ్రూపిజం ఏం చేశామో చెప్పు అంటూ నిలదీసింది. ప్రియాంకని ఏ విషయంలో మానుప్లేట్ చేశా చెప్పు ఎంటూ ఎదిరించింది.

ఆ తర్వాత ఆమెకి వార్నింగ్ ఇస్తూ తిరిగి నామినేట్ చేస్తూ బెదిరించింది. దీంతో భయపడ్డ అశ్విని భోరున ఏడ్చేసింది. అసలు ఆమె దగ్గరకి కూడా రానివ్వట్లేదు, డామినేషన్ అయిపోయింది. బిగ్ బాస్ చెప్పినా కూడా రూల్స్ పాటించడం లేదు అంటూ విలపించింది. అంతేకాదు, స్టార్ మా బ్యాచ్ అంటూ గ్రూపిజం ఆడుతున్నారని గుర్తు చేసింది. దీనికి అశ్వినికి కౌంటర్ ఇచ్చిన శోబాశెట్టి తన పోటని బాల్ కి అంటించి కిక్ చేస్తూ నామినేట్ చేసింది. అశ్వినిని తిరిగి నామినేట్ చేస్తుంటే శోభా ఉగ్రరూపం చూపించింది.

దీంతో అశ్విని కనీసం ఒక్కవారం కూడా నన్ను గేమ్ సరిగ్గా ఆడనివ్వట్లేదు, వెంటనే నామినేట్ చేసేసారు అంటూ ఏడ్చేసింది. మిగతా వాళ్లు ఇది జస్ట్ నామినేషన్ అని, తర్వాత నువ్వు సేఫ్ అయి తిరిగి వస్తావని ధైర్యం చెప్పారు. ఇక్కడ కేవలం శోభాశెట్టి మాత్రమే కాదు, అమర్, ప్రియాంక ఇద్దరూ కూడా అశ్వినినే నామినేట్ చేశారు. దీంతో అస్సలు తీస్కోలేకపోయింది అశ్విని. మరి ఈవారం తనకి ఉన్న క్రేజ్ తో సేఫ్ అవుతుందా. లేదా వచ్చిన మొదటి వారమే (Bigg Boss 7 Telugu) ఇంటికి చెక్కేస్తుందా అనేది చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus