Shobha Shetty: శోభాశెట్టి కాబోయే భర్తకు ఇచ్చిన లగ్జరీ కారు ఖరీదు ఎంతో తెలుసా?

  • June 22, 2024 / 07:14 PM IST

కార్తీకదీపం సీరియల్ ద్వారా శోభాశెట్టి (Shobha Shetty) ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకున్నారు. మోనిత పాత్రలో శోభాశెట్టి నటించారు అని చెప్పే కంటే జీవించారనే చెప్పాలి. బిగ్ బాస్ షో సీజన్7 ద్వారా శోభాశెట్టి పాపులారిటీ మరింత పెరిగింది. శోభాశెట్టి ఒకటి రెండు సినిమాలలో సైతం నటించినా ఆ సినిమాలు ఆమెకు మరీ మంచి పేరును అయితే తెచ్చిపెట్టలేదనే చెప్పాలి. నెలరోజుల క్రితం శోభాశెట్టికి యశ్వంత్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. యశ్వంత్ కూడా నటుడు కాగా కార్తీకదీపం సీరియల్ లో నటించిన సంగతి తెలిసిందే.

మొదట వీళ్లిద్దరి మధ్య స్నేహం మొదలు కాగా తర్వాత రోజుల్లో ఆ స్నేహం ప్రేమగా మారింది. బిగ్ బాస్ షో సమయంలోనే శోభాశెట్టి తన ప్రేమకు సంబంధించిన విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా శోభాశెట్టి ఖరీదైన కారును కొనుగోలు చేసి అతనికి బహుమతిగా ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

బీస్ట్ ఎక్స్.యూ.వీ కారును శోభాశెట్టి కొనుగోలు చేయగా ఈ కారు ఖరీదు మార్కెట్ లో 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం. శోభాశెట్టి కొనుగోలు చేసిన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కార్తీకదీపం సీక్వెల్ లో సైతం శోభాశెట్టి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ భావించినా ఆమె లేకపోవడం గమనార్హం. ఆమె తెలుగు సీరియళ్లకు ప్రాధాన్యత ఇచ్చి కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

కార్తీకదీపం2 రేటింగ్స్ కార్తీకదీపం స్థాయిలో లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ పోషించాలంటే శోభాశెట్టి తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శోభాశెట్టి కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆమె కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus