Mahesh Babu: వామ్మో.. ఆ విషయాలపై మహేష్ కు ఈ రేంజ్ లో అవగాహన ఉందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. 2024 సంవత్సరం జనవరి 12వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మహేష్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమాటోగ్రఫీపై చాలా అవగాహన ఉందని లైటింగ్ లో కొంచెం తేడా వచ్చినా మహేష్ బాబు కనిపెట్టేస్తాడని మనోజ్ పరమహంస చెప్పుకొచ్చారు. మహేష్ బాబు ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్ అని ఆయన కామెంట్లు చేశారు. మిగతా హీరోలు మాత్రం సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా పట్టించుకోరని మనోజ్ పరమహసంస కామెంట్లు చేయడం గమనార్హం. సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలా అబ్జర్వేషన్ తో ఉంటారని ఆయన పేర్కొన్నారు.

షూటింగ్ సెట్ లో మహేష్ బాబు చాలా విషయాలు చెబుతాడని మనోజ్ పరమహంస చెప్పుకొచ్చారు. ఏ సన్నివేశానికి ఏ షాట్ బాగుంటుందో మహేష్ బాబుకు బాగా తెలుసని మనోజ్ పరమహంస వెల్లడించారు. 24 క్రాఫ్ట్స్ గురించి మహేష్ బాబుకు అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. మహేష్ బాబుకు అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టే ఆయన ఈ స్థాయికి ఎదిగాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు (Mahesh Babu) రెమ్యునరేషన్, రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో మహేష్ బాబు ఏ రేంజ్ సక్సెస్ లను అందుకుంటారో చూడాల్సి ఉంది. భవిష్యత్తు సినిమాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డులను తిరగరాయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus