అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బన్నీ కోరుకున్న భారీ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. డీ గ్లామరస్ లుక్ లో నటించి కూడా అద్భుతాలు చేయవచ్చని పుష్ప ది రైజ్ తో బన్నీ ప్రూవ్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పుష్ప ది రైజ్ మూవీ తెగ నచ్చేసింది.
ఈ సినిమా సక్సెస్ తో పుష్ప2 సినిమా కోసం నిర్మాతలు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు. పుష్ప ది రూల్ గ్లింప్స్ కోసమే ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది. అయితే పుష్ప ది రైజ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఆ సినిమా వల్ల నిర్మాతలకు మిగిలిన లాభం చాలా తక్కువ మొత్తమనే సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమా కోసం మరీ భారీగా బడ్జెట్ కేటాయించడం కరెక్ట్ కాదు.
ఈ మధ్య కాలంలో పాజిటివ్ టాక్ వచ్చినా బడ్జెట్ భారీగా పెరగడం వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంది. పుష్ప ది రైజ్ రష్యా ప్రమోషన్స్ కోసం నిర్మాతలు ఏకంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. పుష్ప2 గ్లింప్స్ లో బన్నీ లుక్ కొత్తగా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పుష్ప2 గ్లింప్స్ లో బన్నీ పులితో ఫైట్ చేసే షాట్స్ కూడా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లీకైన డైలాగ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. పుష్ప ది రూల్ తో 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం బన్నీ టార్గెట్ గా పెట్టుకోగా ఆ టార్గెట్ ను బన్నీ రీచ్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది ఇదే సమయానికి పుష్ప ది రూల్ రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!