పుట్టి పెరిగినప్పటినుండి రాజకీయాల్లో ఉన్నవాళ్లకంటే అక్కడి పద్ధతులు.. ఎత్తులు, పై ఎత్తులు అనేవి కొట్టినపిండే కానీ.. సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్లిన వాళ్లకి అంత త్వరగా అర్థం కావు. అందుకే ఏ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులైనా సరే పాలిటిక్స్‌లోకి వెళ్లారంటే మాత్రం వాళ్లని పర్సనల్‌గా టార్గెట్ చేయడం అనేది కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. సినిమా వాళ్ల ప్రొఫెషనల్ లైఫ్‌కి పర్సనల్ లైఫ్‌కి లింక్ పెడుతూ మాట్లాడుతుంటారు. ఇప్పుడు నటి ఖుష్బూకి కూడా ఇలాంటి అవమానం ఎదురైంది.
ఓ అధికార పార్టీకి చెందిన నేత ఆమెను ఏకంగా ‘ఐటమ్’ అని సంబోధించాడు. ఈ వార్త సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులోని అధికార పార్టీకి చెందిన డీఎంకే నేత సైదై సాధిక్ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఖుష్బూతో పాటు బీజేపీలో ఉన్న నటీమణులను ‘ఐటమ్స్’ అని సంబోధించాడు. దీనిపై ఖుష్బూతో సహా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా నేతలంతా సీరియస్‌గా స్పందించారు. ఈ విషయంలో ఖుష్బూ చేసిన ట్వీట్‌కి సినీ వర్గాలవారితో పాటు నెటిజన్లంతా తమ మద్దతు తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, పార్టీ మహిళా నేత కనిమొళి, ఖుష్బూ విషయంలో సాటి మహిళగా స్పందించారు. తమ పార్టీ నేత అన్నమాటల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఖుష్బూని క్షమాపణలు కోరారు కనిమొళి.. దీంతో పలువురు మహిళా నేతలు ఆమెను అభినందిస్తున్నారు. అలాగే ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సైదై సాధిక్ తక్షణమే క్షమాపణ చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!