Chennakesava Reddy: అక్కడ చెన్నకేశవరెడ్డి క్రేజ్ మామూలుగా లేదుగా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్న బాలకృష్ణ ఏడాదికి ఒక సినిమా రిలీజయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి మూవీ రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. 2002 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన విడుదలైన చెన్నకేశవరెడ్డి బ్లాక్ బస్టర్ స్టేటస్ ను అందుకోకపోయినా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది.

బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేయగా రెండు పాత్రల్లోనూ అద్భుతంగా నటించి బాలయ్య తన నటనతో మెప్పించారు. టబు, శ్రియ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా వాళ్లిద్దరి పాత్రలకు సైతం మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు కావడంతో ఈ సినిమాకు స్పెషల్ షోలు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ నెల 24, 25 తేదీలలో యూఎస్ లో 30కు పైగా చెన్నకేశవరెడ్డి మూవీ స్పెషల్ షోలు ప్రదర్శితం కానున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా రీ రిలీజ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. యూఎస్ లో కూడా బాలయ్యకు వీరాభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య గత సినిమా అఖండ యూఎస్ లో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. చెన్నకేశవరెడ్డి మూవీ స్క్రీన్ ప్లేలో కొన్ని చిన్నచిన్న తప్పులు జరగగా ఆ తప్పులు జరగకుండా ఉండి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగి ఉండేది.

ఈ సినిమా తర్వాత బాలయ్య వివి వినాయక్ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. ఈ సినిమాలోని పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వినాయక్ జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచేదని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus