Gunturu Karam: గుంటూరు కారం ట్విస్టుల వెనుక అసలు కారణం మహేష్ బాబేనా?

మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీ గుంటూరు కారం సినిమాకు సంబంధించి తెర వెనుక ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. హీరోయిన్ల విషయంలో, టెక్నీషియన్ల విషయంలో మార్పులు జరుగుతుండటంతో ఈ సినిమాకు సంబంధించి మహేష్ ఫ్యాన్స్ సైతం టెన్షన్ పడుతున్నారు. రికార్డు స్థాయిలో గుంటూరు కారం సినిమా బిజినెస్ జరుగుతుండగా ఊహించని మార్పులు ఈ సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతారేమోనని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ బాబు వెకేషన్లకు ఎక్కువగా వెళుతుండటం కూడా అభిమానులను ఒకింత గందరగోళానికి గురి చేస్తోంది.

మహేష్ కు కొన్నిసీన్ల విషయంలో పూర్తి సంతృప్తి లేకపోవడం వల్ల షూటింగ్ ఆలస్యమవుతుండటంతో హీరోయిన్, టెక్నీషియన్లు డేట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం ఫ్యాన్స్ ను బాధ పెట్టింది. మహేష్ బాబు లేదా చిత్రయూనిట్ వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించి స్పష్టత ఇస్తే మాత్రమే ఈ వార్తలు ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది.

త్రివిక్రమ్ ఇతర ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతుండటం మహేష్ కు నచ్చడం లేదని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. త్రివిక్రమ్ ఇతర సినిమాలకు న్యాయం చేస్తూ గుంటూరు కారం సినిమాకు అన్యాయం చేస్తున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబును ఏ విధంగా చూపించనున్నారో తెలియాల్సి ఉంది.

షూటింగ్ ఆలస్యమైతే 2024 సంక్రాంతికి కూడా (Gunturu Karam) ఈ సినిమా రిలీజ్ కావడం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా వీళ్లిద్దరి పాత్రలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. శ్రీలీల ఈ సినిమాలో పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus