సినిమా థియేటర్ లో హీరోని తెరపై చూస్తూ ఈలలు వేస్తున్న ఓ ప్రేక్షకుడితో..పక్క సీట్లో ఉన్న ఓ ఇరవైఏళ్ళ యువకుడు నేను కూడా హీరోనే..ఓ సినిమా తీశాను అన్నాడట. ఎగాదిగా ఆ యువకుడిని చూసిన ప్రేక్షకుడు ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అన్నాడట. దానితో మనసులో నవ్వుకొని థియేటర్ నుండి బయటికి వచ్చేశాడట ఆ యువకుడు. అతను చెప్పినట్లు తన మొదటి చిత్రం 2000లో విడుదలైంది సూపర్ హిట్ కొట్టింది. ఆ నెక్స్ట్ ఇయర్ మరో సినిమా చేశాడు అది బ్లాక్ బస్టర్, అదే ఏడాది మరో సినిమా ఆ యువ హీరో నుండి రాగా అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. హ్యాట్రిక్ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న ఆ హీరో ఎవరో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది. అతనే లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్.
ఆయన నటించిన మొదటి మూడు సినిమాలు చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఎటువంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా, స్టార్ హీరో వారసులకు కూడా అందని ఫీట్ ఉదయ్ కిరణ్ సాధించారు. హైదరాబాద్ కి చెందిన ఓ సనాతన బ్రాహ్మణ కుటుంబలో పుట్టాడు ఉదయ్ కిరణ్ . చూస్తే బాగా పరిచయం ఉన్న పక్కింటి కుర్రాడిలా అతని పేస్ కట్ అండ్ బిహేవియర్ ఉండేది. సెకండ్ సినిమా కోసమే ఉదయ్ కిరణ్ సిక్స్ ప్యాక్ తో కండలు పెంచాడు. అప్పటికి టాలీవుడ్ లో అసలు ఈ ట్రెండ్ లేదు. ఉదయ్ కిరణ్ తో అనేక సినిమాలు చేసిన కమెడియన్ సునీల్ ఉదయ్ కిరణ్ గురించి చెవుతూ..నువ్వు నేను సినిమాలో రన్నింగ్ రేస్ కోసం నిజమైన రేసర్లను డైరెక్టర్ తేజ తీసుకొస్తే, నిజంగానే రేసులో వారికంటే బాగా పరుగెత్తాడట. ఎలా చేశావ్ అని సునీల్ అడిగితే చిన్నప్పటి నుండి బస్సుల వెనుక పరిగెత్తి అలవాటై పోయింది అని ఫన్నీ సమాధానం చెప్పాడట ఉదయ్ కిరణ్.
అతి తక్కువ వయసులో నటుడిగా ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు ఉదయ్, కమల్ హాసన్ తరువాత ఆ ఫీట్ సాధించిన హీరోగా రికార్డులకు ఎక్కాడు. కారణాలేమైనా క్రమేణా ఉదయ్ కిరణ్ కి ఇండస్ట్రీలో విజయాలు, అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆయన కెరీర్ కూలిపోవడం వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని కొందరి వాదన. అసలు నిజాలు ఏమిటనేది ఇప్పుడు చర్చించుకోవడం కూడా అనవసరం.
Most Recommended Video
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!