Adhurs Movie: అదుర్స్ సినిమాలో తారక్ కు డూప్ గా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వివి వినాయక్ (V. V. Vinayak) కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన (Aadi) ఆది, (Samaba) సాంబ, అదుర్స్ (Adhurs) సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. అదుర్స్ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో నటించారు. నరసింహ, నరసింహాచారి పాత్రలలో అద్భుతమైన అభినయంతో తారక్ ఆకట్టుకున్నారు. మేకప్ ఆర్టిస్ట్ గా పని చేసే కిరణ్ అనే వ్యక్తి ఈ సినిమాలో తారక్ కు డూప్ గా పని చేశారని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ కు సాధారణంగా డూప్ గా చేసే వ్యక్తి ఆరోజు షూట్ కు రాకపోవడం వల్ల ఎన్టీఆర్ ఆహార్యానికి దగ్గరగా ఉండే వ్యక్తి అయిన మేకప్ మేన్ ను డూప్ గా నటింపజేశారని తెలుస్తోంది. 2010 సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. అప్పట్లో ఈ సినిమా నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించింది.

ఎన్టీఆర్ వినాయక్ కాంబో రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందేమో చూడాల్సి ఉంది. గత కొంతకాలంగా వినాయక్ కెరీర్ ఆశాజనకంగా లేదు. వినాయక్ డైరెక్షన్ లో ఇటీవల తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. వినాయక్ కు మళ్లీ పూర్వ వైభవం రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర (Devara) సినిమాతో పాటు మరో నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ప్రతి ప్రాజెక్ట్ భారీ రేంజ్ లో తెరకెక్కుతుండగా వరుస సినిమాల వల్ల తారక్ కు భారీ విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా తారక్ అడుగులు పడుతుండగా కెరీర్ పరంగా మరింత ఎదిగి మార్కెట్ ను ఊహించని స్థాయిలో పెంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus