విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ మాత్రం ఆశించిన విధంగా లేదు. ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిల్ కావడం లియో మూవీకి శాపంగా మారింది. అయితే లియో సినిమాటోగ్రాఫర్ లియో ఫ్లాష్ బ్యాక్ నిజం కాదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
లియో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లియో సినిమా సెకండాఫ్ లో చూపించిన ఫ్లాష్ బ్యాక్ తప్పు కావచ్చని అన్నారు. లియో ఫ్లాష్ బ్యాక్ గురించి కొన్ని నిమిషాలు చూపించాలి కాబట్టి సినిమాలో చూపించామని ఆయన కామెంట్లు చేశారు. సినిమాలో అపరిచితుడు ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పినప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ అబద్ధం కూడా కావచ్చని మనోజ్ పరమహంస పేర్కొన్నారు.
అయితే మనోజ్ పరమహంస చేసిన కామెంట్లు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయి. లియో మేకర్స్ ఆడియన్స్ ను పిచ్చోళ్లను చేస్తున్నారా? అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. లియో సినిమా ఫ్లాష్ బ్యాక్ విషయంలో నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మేకర్స్ కవర్ చేసుకోవడానికి ఈ విధంగా చెబుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లియో సినిమాకు సీక్వెల్ తెరకెక్కే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.
లియో సినిమా రెండో రోజు 44 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. లియో సినిమా కలెక్షన్లు డ్రాప్ అయినా ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. లియో సినిమా రాబోయే రోజుల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. (LEO) లియో సినిమా విజయ్ అభిమానులకు ఎంతగానో నచ్చేసింది.