రవితేజ హీరోయిన్ గురించి మనకు తెలియని నిజాలు..!

రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నేనింతే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సియా గౌతమ్. ఈమె అసలు పేరు అధితి గౌతమ్ అయినప్పటికీ సియా గౌతమ్ గానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. 2008 లో వచ్చిన ‘నేనింతే’ చిత్రంలో ఈమె సంధ్య అనే పాత్ర పోషించింది. పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ చిన్న స్థాయిలో రైటర్ గా పనిచేసే రవి(రవితేజ) ని ప్రేమించే అమ్మాయిగా ఈమె కనిపిస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఏ రకంగా వేధింపులకు గురవుతారు అనే విషయాన్ని ఈ పాత్ర ద్వారా చూపించాడు పూరి. ఈమె కూడా ఆ పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేసిందనే చెప్పాలి. గ్లామర్ షో విషయంలో కూడా ఈమె అస్సలు తగ్గలేదు. అయితే ఆ చిత్రం హిట్ అయితే సియాకు ఎక్కువ అవకాశాలు వచ్చేవేమో.. కానీ ఆ చిత్రం హిట్ అవ్వలేదు కాబట్టి.. ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తరువాత ‘వేదం’ సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ అది పెద్ద గుర్తుంచుకునే పాత్ర కాదు.

ఇక సియా బాలీవుడ్లో ‘సంజు’ చిత్రంలో కూడా నటించింది. అయినప్పటికీ ఈమెకు కలిసొచ్చిందేమీ లేదు. ఇక సియా ప్రస్తుతం ముంబైలో తన అన్నయ్య, వదినలతో కలిసి ఉంటుందట. వాళ్ళ బిజినెస్ లు చూసుకుంటూ.. అప్పుడప్పుడు వచ్చే సినిమా ఆఫర్లను చేస్తూ ఆమె ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39\

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..! b

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus