Mahesh Babu: మహేష్ బాబు అలాంటి కథలకు నో చెప్పడానికి కారణాలివేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య కాలంలో వరుసగా మాస్ సినిమాలలో నటిస్తూ ఆ సినిమాలతో ఊహించని స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ కు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉంది. గుంటూరు కారం సినిమా నుంచి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.

అయితే మహేష్ బాబు యానిమల్ సినిమాను రిజెక్ట్ చేశారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. యానిమల్ సినిమా ట్రైలర్ గూస్ బంప్స్ వచ్చేలా ఉండగా ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే అభిప్రాయం ట్రైలర్ చూపిన ప్రేక్షకుల్లో కలుగుతోంది. అయితే మహేష్ పుష్ప, యానిమల్ లాంటి సినిమాలను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. తనకు నప్పని పాత్రలు అని మహేష్ ఈ సినిమాలను రిజెక్ట్ చేసినట్టు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి సినిమాలలో నటిస్తే సూపర్ స్టార్ మహేష్ బాబును కొత్త లుక్స్ లో చూసే అవకాశం కూడా లభిస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు వయెలెంట్ రోల్స్ ఉన్న సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే మహేష్ బాబు స్పందిస్తే మాత్రమే ఈ సినిమాలను రిజెక్ట్ చేయడం వెనుక అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళి కాంబో షూట్ 2024 మార్చి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెపించే మూవీ కావడంతో పాటు రికార్డులు క్రియేట్ చేసే మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ మూడు నుంచి నాలుగేళ్ల పాటు జరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus