ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో చాలా ఘోరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క చాలా మంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యల కారణంగా, వయసు సంబంధిత సమస్యల కారణంగా మరణిస్తుంటే మరోపక్క బలవన్మరణానికి పాల్పడేవారు, భార్యపై దాడి చేసే నటులు,భర్తను ప్రియుడి కోసం బిల్డింగ్ పై నుండి తోసేసే నటీమణులు.. వంటి వారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. తాజాగా ఓ నిర్మాత అయితే విగతజీవిగా కనిపించాడు.
వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్లో ఘోరమైన విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ప్రముఖ నిర్మాత జైసన్ జోసెఫ్ విగతజీవిగా మారి కనిపించి షాకిచ్చాడు. కొచ్చిలో ఉన్న తన అపార్ట్మెంట్ లో ఆయన శవమై కనిపించాడు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాడీని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి పంపించారు.
ఆయన మృతి పట్ల మలయాళం నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. 44 ఏళ్ళ వయసుకే జైసన్ జోసెఫ్ మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసింది. ఈయన పలు సినిమాలను నిర్మించడంతో పాటు నిర్మాతల సంఘంలో సభ్యుడిగా కూడా కొనసాగేవారు. 2017 లో వచ్చిన బీజు మీనన్ ‘లవ కుశ’ చిత్రాన్ని నిర్మించింది జోసెఫ్ అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. దీంతో పాటు ఆయన ‘జమ్నా ప్యారీ’ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇక జోసెఫ్ మరణానికి కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!