పెళ్ళికి ముందు అలా… స్టార్ హీరోయిన్ పరిస్థితి ఇలా అయిపోయింది..!

ఈరోజుల్లో ప్రేమ, డేటింగ్, బ్రేకప్ వంటి వ్యవహారాలు చాలా కామన్. ఒకప్పుడు ఇలాంటి న్యూస్..లు వింటే అంతా విడ్డూరం అనుకునే వారు. కానీ ఇప్పుడు అవి చాలా కామన్ అనుకుంటున్నారు. నిజజీవితంలో కూడా ఇలాంటివి బోలెడన్ని వార్తలు వింటున్నాం. అలాంటప్పుడు సినీ పరిశ్రమలో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే పెద్దగా విడ్డూరం అనిపించదు. పైగా బాలీవుడ్ పరిశ్రమలో ఇలాంటివి చాలా చిన్న విషయాలు. సరే అసలు విషయానికి వచ్చేద్దాం.. బాలీవుడ్ కి చెందిన ఓ సీనియర్ స్టార్ హీరోయిన్.. పెళ్లికి ముందే 12 మందితో డేటింగ్ చేసిందట.

తర్వాత అవన్నీ వదిలేసి పెళ్లి చేసుకున్నా… ఎక్కువ కాలం ఆమె తన భర్తతో కలిసి జీవించలేడు. విడాకులు తీసుకుని ఇప్పుడు సింగిల్ గా జీవిస్తుంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ స్టార్ స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాల (Manisha Koirala). 1991 వ సంవత్సరంలో తన నటనా జీవితాన్ని మొదలు పెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి తన గ్లామర్ తో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. అటు తర్వాత స్టార్ స్టేటస్ సంపాదించుకుని.. వేరే భాషల సినిమాల్లో కూడా నటించింది.

తమిళ సినీ పరిశ్రమలో కూడా మంచి పేరు సంపాదించుకున్న ఈమె… తెలుగులో కూడా ‘క్రిమినల్’ వంటి సినిమాలో నటించింది. ఈమె ఆ టైంలో ఎంతో మంది హీరోలతో డేటింగ్ వ్యవహారాలు నడిపింది. అటు తర్వాత అంటే 2010 లో నేపాల్ కి చెందిన ఓ బిజినెస్ మెన్ ను వివాహం చేసుకుని సినిమాలు తగ్గించింది. అయితే తర్వాత మనస్పర్థలు రావడంతో 2012 లోనే అతనితో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఈమె వయసు 53 ఏళ్ళు. రెండో పెళ్లి చేసుకోకుండా ప్రస్తుతం సింగిల్ గానే ఉంటూ వస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus