ఎన్టీఆర్ మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నారా?

సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన హీరో సినిమాల గురించి ఆప్టేడ్స్ ని అభిమానులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఆనందిస్తున్నారు. అదే సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు ఆందోళనను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ గా తారక్    లైపోసక్షన్ ఆపరేషన్ చేసుకున్నారని, అతని శరీరం నుంచి 5 కిలోల కొవ్వును తొలిగించారని గత రెండు రోజులుగా వార్త షికారు చేస్తోంది. అందుకే అజ్ఞాతవాసి ఆడియో వేడుకకు రాలేకపోయారని రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ గాసిప్స్ పై ఎన్టీఆర్ కి సంబంధించిన వారెవరూ స్పందించకపోవడం, వారం రోజులుగా ఎన్టీఆర్ బయట కనిపించక పోవడంతో.. ఇవి నిజమేమోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

ఎన్టీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. జై లవకుశ తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతనెల లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకోసం 18 కిలోల బరువు  తగ్గాలని తారక్ డిసైడ్ అయినట్లు సమాచారం. కథ కోసం  టీనేజీ కుర్రోడిలా మారాలని ఫిక్స్ అయ్యారు. గతంలోనూ యమదొంగ, కంత్రి మూవీ సమయంలో పాతిక కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు కూడా అలాగే బరువు తగ్గాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకు ముంబయి న్యూట్రిషన్ తో సలహాలు తీసుకొని, నిపుణులు చెప్పినట్లుగా డైట్ ఫాలో అవుతున్నారు. అయితే లైఫో సెక్షన్ చేయించుకున్నారని సంగతి పైనే ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై ఎన్టీఆర్ త్వరలోనే స్పందిస్తే అభిమానులు సంతోషంగా ఉంటారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus