Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మేకర్స్ షాకిచ్చారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  కొరటాల శివ  (Koratala Siva)  కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర (Devara) రిలీజ్ కు 6 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా నోవాటెల్ లో ఈ ఈవెంట్ జరగనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బేస్ ఈ సినిమాతో మరింత పెరగడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Jr NTR

ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా ఆయుధ పూజ సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజ్ అవుతుందో లేదో అధికారికంగా క్లారిటీ లేదు. ట్రైలర్ పై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ నటించిన మాస్ మూవీ కావడంతో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో సంచలనాలు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే దావూదీ సాంగ్ మాత్రం రోలింగ్ టైటిల్స్ లో ఉంటుందని వార్తలు వినిపించినా అసలు సినిమాలో ఆ సాంగ్ ఉండబోదని తెలుస్తోంది. ఆ సాంగ్ కు నెగిటివ్ కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో సాంగ్ ను తీసేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్. వైరల్ అవుతున్న వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. కొరటాల శివ దేవర విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదని భోగట్టా.

దేవర సినిమా ఈవెంట్ లో తారక్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దేవర1 మూవీలో ట్విస్టులు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. దేవర2 సినిమాకు సంబంధించి చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవరకు సంబంధించి ప్రేక్షకుల్లో నెలకొన్న సందేహాలకు సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి.

‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాన్స్‌ చెప్పిన తమన్‌.. తేడా కొడుతోంది రాజుగారూ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus