‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే.. ‘క్రిస్‌మస్‌కే’ అనే సమాధానం టీమ్ నుండి వస్తోంది. ఇక్కడ టీమ్ అంటే నిర్మాత దిల్ రాజు ఒక్కరే. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్ కోసం అడిగీ, అడిగీ అలసిపోయిన ఫ్యాన్స్‌కు ‘క్రిస్‌మస్‌కి వస్తాం’ ని ఫుల్ కిక్ ఇచ్చారు ఆ మధ్య దిల్ రాజు (Dil Raju) . అయితే సినిమా ప్రమోషన్స్, సినిమా టీమ్ నుండి వస్తున్న మాటలు చూస్తుంటే పరిస్థితి వేరేలా ఉంది.
సినిమా సంగీత (S.S.Thaman) దర్శకుడు ఇటీవల చెప్పిన విషయాలు చూస్తుంటే.. సినిమా అనుకున్నట్లుగా క్రిస్‌మస్‌కి వస్తుంది అనిపిస్తోంది కానీ.. సాధ్యమేనా అనే మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే సినిమాను క్రిస్మస్ కానుకగా పక్కాగా తీసుకొస్తామని నిర్మాత దిల్ రాజు నమ్మకంగా ఒకటి రెండు వేదికల మీద చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎక్కడా రిలీజ్ డేట్ చెప్పలేదు. అంతేకాదు వస్తున్న పోస్టర్ల మీద కూడా ఎక్కడా డేట్ కానీ, సీజన్ కానీ ఇవ్వడం లేదు.
ఇదిలా ఉండగా త్వరలో రెండో పాట విడుదల చేస్తామంటూ వినాయకచవితి సందర్భంగా సినిమా టీమ్ అనౌన్స్ చేసింది. తాజాగా తమన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అక్టోబర్ 1 నుండి సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ మొదలుపెడతామని, డిసెంబర్ 20 వరకు ప్రచారం ఫుల్‌స్పీడ్‌లో చేస్తామని చెప్పారు. వచ్చే వారం నుండి ఈ ప్రచారం మొదలవుతుంది అని కూడా చెప్పారు. ఈ లెక్కన డిసెంబరు 20న సినిమా పక్కా అనేస్తున్నారు.
కానీ, శంకర్ (Shankar) విషయం తెలిసినాళ్లు మూడు నెలల్లో సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారా? ఒకవేళ ఓకే అంటే ప్రచారానికి సమయం సరిపోతుందా అనే డౌట్ తీసుకొస్తున్నారు కొందరు. మార్చి అవ్వొచ్చేమో అంటే కొత్త డిస్కషన్స్‌కి లైన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీమ్ అర్జెంట్‌గా సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయకతప్పదు. మరి కొత్త పాట రిలీజ్ చేసినప్పుడు ఏమన్నా చెబుతారేమో చూడాలి.