ప్రముఖ టాలీవుడ్ యాంకర్లలో ఒకరైన అనసూయ నటించిన సినిమాలలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు మాత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తున్నాయి. అయితే అనసూయ నటించిన అరి సినిమాకు కళ్లు చెదిరే ఆఫర్ నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చిందని సమాచారం అందుతోంది. జయశంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఓకే చెబితే 10 కోట్ల రూపాయలు ఇస్తామని నెట్ ఫ్లిక్స్ ఆఫర్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. టాలీవుడ్ ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించడం వల్ల కూడా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. రొటీన్ కథలకు భిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కిందని మనిషి ఎలా బ్రతకకూడదనే విషయాన్ని ఈ సినిమాలో చర్చించనున్నారని సమాచారం అందుతోంది.
ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సాయికుమార్ మరి కొందరు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారని తెలుస్తోంది. ఈ సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్ గా కనిపించనున్నారని జెలసీతో కూడిన ఆ పాత్ర అనసూయ ఇప్పటివరకు పోషించిన ఇతర పాత్రలకు భిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఈ సినిమా మేకర్స్ అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది.
ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య కాలంలో వరుసగా క్రేజ్ ఉన్న సినిమాలను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ఇతర ఓటీటీలకు నెట్ ఫ్లిక్స్ గట్టి పోటీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ కొత్త సినిమాలను కొనుగోలు చేయడం ద్వారా స్థాయిని పెంచుకుంటోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాల ద్వారా నెట్ ఫ్లిక్స్ కు భారీ లాభాలు వస్తున్నాయని బోగట్టా.