దీపికా పడుకొనే ఇన్సెక్యూరిటీకి కారణం అదేనా?

బాలీవుడ్ నటీనటులకు అలాగే అక్కడి మీడియాకు సౌత్ హీరోలు అన్నా, ఇక్కడి సినిమాలు అన్నా వాళ్లకు చాలా చిన్న చూపు. ముఖ్యంగా తెలుగు సినిమాలని మరింత తక్కువగా చూస్తుంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు అక్కడి ప్రేక్షకులు మాత్రం వారిలా ప్రవర్తించడం లేదు లెండి..! వాళ్ళు మన సినిమాల కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. మన సౌత్ రీమేక్ లను వాళ్ళు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇది పక్కన పెడితే తాజాగా ‘ప్రభాస్21’ సినిమాలో దీపికా పడుకొనె హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు అనౌన్స్ చేసారు.

ఈ చిత్రంలో నటించడం కోసం ఆమెకు 30 కోట్లు పారితోషికం ఇస్తున్నట్టు బాలీవుడ్ మీడియా రాసుకొస్తుంది. కేవలం అందుకోసమే ప్రభాస్ సినిమాలో దీపిక నటిస్తుంది అన్నట్టుగా అక్కడి మీడియా ప్రచారం చేస్తుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. అదంతా ఫేక్ అని తెలుస్తుంది. ఈమెకు 15కోట్లు పారితోషికం ఇస్తున్నారని వినికిడి. చెప్పాలంటే అది కూడా ఈమెకు ఎక్కువే. అక్కడ ఈమెకు పెద్ద రేంజ్లో ఆఫర్లు ఎలాగో లేవు. ప్రభాస్21 లో లో ఛాన్స్ రావడం ఈమె అదృష్టం అనే చెప్పాలి.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని ‘ప్రభాస్ 21’ అని ప్రమోట్ చెయ్యడం కూడా దీపిక కు ఇష్టం లేదట. సౌత్ హీరో పేరుతో సినిమాని ప్రమోట్ చేస్తుండడాన్ని ఆమె నామోషీగా ఫీలవుతుందట. చెప్పాలంటే బాలీవుడ్ లో ఈమె ఫేడౌట్ అయిపోవడానికి రెడీగా ఉంది. అయినప్పటికీ ఇంత ఇన్సెక్యూరిటీ ఎందుకు? అని బాలీవుడ్ ప్రేక్షకులే కామెంట్స్ చేస్తుండడం గమనించాల్సిన విషయం.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus