బాహుబలి నటీనటుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

బాహుబలి సినిమాని మొదలెట్టేటప్పుడు రాజమౌళి కూడా ఊహించి ఉండరు.. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని. నటీనటులు కూడా గొప్ప సినిమాని చేస్తున్నామని అనుకున్నారేగాని కలెక్షన్లకు కొత్త లక్ష్యాలను ఏర్పరుస్తుందని భావించలేదు. అయినా ప్రతి ఒక్కరూ కస్టపడి ఐదేళ్లు పనిచేశారు. ఇప్పుడు ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రెమ్యునరేషన్స్ కూడా భారీగానే అందుకున్నట్లు సమాచారం. సినీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం బాహుబలి ప్రధాన నటీ నటులు అందుకున్న పారితోషికం వివరాలు..

ప్రభాస్
బాహుబలి బిగినింగ్ 600 కోట్లు రాబట్టడంతో ప్రభాస్ రెమ్యూనరేషన్లో కూడా నిర్మాతలు మార్పులు చేశారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా నటించిన ప్రభాస్ కు 25 కోట్లు అందజేశారు.

రానా
నెగిటివ్ రోల్ భల్లాల దేవా పాత్రలో రానా బాహుబలికి గట్టి పోటీ ఇచ్చారు. అతనికి 15 కోట్లు ముట్టజెప్పారు.

అనుష్క
దేవసేనగా అలరించిన అనుష్క బాహుబలి సినిమాకోసం ఐదుకోట్లు అందుకున్నారు. ఇదివరకు ఆమె సినిమాకి కోటి మాత్రమే తీసుకునేవారు.

రమ్యకృష్ణ
శివగామిగా రమ్యకృష్ణ అద్భుత నటన ప్రదర్శించారు. ఈ మూవీకి ఆమె 2 .5 కోట్లు అందుకొని క్యారక్టర్ ఆర్టిస్టులు కూడా భారీ రెమ్యునరేషన్ అందుకోవచ్చని నిరూపించారు.

సత్యరాజ్ బాహుబలి వెంటే ఉంటూ.. కథనంతా తన వెంట తిప్పుకున్న కట్టప్పగా సత్యరాజ్ నటన అమోఘం. ఆయన ఈ సినిమాకు 2 .5 కోట్లు పారితోషికం అందుకొని ఔరా అనిపించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus