మహేష్ బాబు(Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ అనగానే మహేష్ అభిమానులు భారీ ఆశలు పెట్టేసుకుంటారు. వీరి కాంబోలో వచ్చిన ‘అతడు’ (Athadu) డీసెంట్ సక్సెస్ అందుకుంది. అయితే టీవీల్లో మెగా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తర్వాత వచ్చిన ‘ఖలేజా’ (Khaleja) థియేటర్లలో అస్సలు ఆడలేదు. కానీ టీవీల్లో అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఈ ఏడాది సంక్రాంతి వీరి కాంబినేషన్లో 3వ సినిమాగా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా వచ్చింది. అయితే మొదటి షోతోనే ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
దాని వల్ల థియేటర్స్ లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కమర్షియల్ గా ఈ సినిమా సేఫ్ అని నాగవంశీ (Suryadevara Naga Vamsi) చెబుతుంటారు. ఆంధ్రాలో బాగా ఆడింది అని ట్రేడ్ పండితులు కూడా చెప్పారు. అయితే ఫ్యాన్స్ ఒకటి ఆశించి థియేటర్ కి వెళ్తే.. సినిమాలో ఇంకోటి ఉండేసరికి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. పండగ సీజన్ కలిసి రావడంతో క్యాష్ చేసుకుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ అభిమానులు ఆశించిన సక్సెస్ అయితే ‘గుంటూరు కారం’ సొంతం చేసుకోలేకపోయింది.
ఇది కూడా వాస్తవమే. అయితే ఓటీటీల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో చాలా వారాల పాటు టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది. ఇదిలా ఉంటే.. 2025 న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రాన్ని రీ- రిలీజ్ చేస్తున్నారు. ఈసారి ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందా? అనే చర్చ సోషల్ మీడియాలో షురూ అయ్యింది. కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం.
రిలీజ్ టైంలో సినిమాలు బాలేదు అని చెప్పిన జనాలు.. రీ రిలీజ్..ల టైంలో వాటిని నెత్తిన పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు ‘గుంటూరు కారం’ విషయంలో కూడా అదే హడావుడి కనిపించే అవకాశం లేకపోలేదు. పైగా ఇప్పుడు థియేటర్లలో సరైన సినిమా లేదు. ‘పుష్ప 2’ హవా కూడా తగ్గిపోయింది. సో ‘గుంటూరు కారం’ కి మంచి ఛాన్సే.