మరో 36 గంటల్లో ఏజెంట్, పీఎస్2 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా పొన్నియిన్ సెల్వన్2 సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఏజెంట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తమిళ ప్రేక్షకులు మాత్రం పొన్నియిన్ సెల్వన్2 సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కాయనే సంగతి తెలిసిందే.
అయితే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు సోషల్ మీడియా వేదికగా ఈ రెండు సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇవ్వగా ఆ రివ్యూలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అభిమానులకు కోపం తెప్పించే విధంగా ఉమైర్ సంధు రివ్యూలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పొన్నియిన్ సెల్వన్2 మూవీ టార్చర్ అని ఆయన కామెంట్లు చేశారు. పొన్నియిన్ సెల్వన్2 సినిమా చూడటానికి ఏ మాత్రం బాలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏజెంట్ (Agent) సినిమా గురించి ప్రస్తావిస్తూ మెరిసేదంతా బంగారం కాదు అని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు. ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్2 సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఉమైర్ సంధుపై మరోసారి ట్రోల్స్ తప్పవని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమైర్ సంధు అనవసరంగా సినిమాల గురించి నెగిటివ్ ప్రచారం చేస్తూ ఆ సినిమాల కలెక్షన్లకు నష్టం చేకూరేలా చేస్తున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సినిమా విడుదలకు ముందే నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వాళ్ల విషయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమైర్ సంధుకు టేస్ట్ లేదని ఆయనకు ఏ సినిమా నచ్చడం లేదని మరి కొందరు చెబుతున్నారు. ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్2 సినిమాల ఫలితాల విషయంలో మేకర్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?